వైద్య చికిత్సకు ఆర్థిక భరోసా: రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేత

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సిఫారసుతో చౌటుప్పల్ పట్టణానికి చెందిన బాధితుడికి వైద్య చికిత్స నిమిత్తం రెండున్నర లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి బాధితుడికి దీనిని అందించగా లబ్ధిదారు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.స్థానిక కౌన్సిలర్‌ పాక చిరంజీవి, కాంగ్రెస్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మొగుదాల రమేష్‌గౌడ్‌, డీసీసీ కార్యదర్శి చింతల సాయిలు, మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు చెరుకు లింగస్వామిగౌడ్‌, ప్రధాన కార్యదర్శి ఎర్రగోని లింగస్వామి యాదవ్‌, ఇప్ప వెంకటేష్‌, వక్కాల కుమార్‌, మాదని గోపాల్‌, ఎండీ వహీద్‌, అంతటి బాలరాజుగౌడ్‌, గుండెబోయిన ఐలయ్య యాదవ్‌, దోమ్మాటి దయాకర్‌రెడ్డి, ఓర్సు రాజు తదితరులు పాల్గొన్నారు.