అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు రూ. పదిహేడు వేల రిఫండ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమెరికా

అమెజాన్ సంస్థ అనుమతి లేకుండా ప్రైమ్ మెంబర్షిప్ రుసుములు వసూలు చేసిన నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట లభించిందని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వర్గాలు వెల్లడించాయి. గతంలో అమెరికాలో మోసపూరితంగా సభ్యత్వాలు జోడించినందుకు కోర్టు ఆదేశాలతో ఒక్కో బాధితుడికి సుమారు రెండు వందల డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు పదిహేడు వేల రూపాయల వరకు తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రత్యేక దరఖాస్తు లేకుండానే నేరుగా ఈ సొమ్ము అర్హులైన ఖాతాల్లో జమ కానుందని స్పష్టం చేశారు.