కొండపిలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన జలవనరుల మంత్రి నిమ్మల
రిపోర్టర్: అశోక్
స్థలం: పశ్చిమ గోదావరి
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నరసింగోలులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహచర మంత్రులు మరియు కూటమి పార్టీల నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలకడం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా కొండేపి నియోజకవర్గంలో పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ స్పిల్ వే మరియు ప్రధాన తూముల నిర్మాణ పనులపై ముఖ్యమంత్రికి వివరాలు అందించామని ఆయన పేర్కొన్నారు.