మచిలీపట్నంలో ముగ్గురు కోట్ల అభివృద్ధి పనులు: ప్రజలతో మమేకమైన మంత్రి కొల్లు రవీంద్ర

రిపోర్టర్: రాము స్థలం: కృష్ణా

ప్రజల సమస్యలను తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించినట్లు కొల్లు రవీంద్ర - గనుల & ఎక్సైజ్ శాఖ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే వెల్లడించారు. గత రెండు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ పరిధిలో సుమారు మూడు వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపట్టామని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి సవివరంగా వివరించడం జరిగిందని పేర్కొన్నారు.