టీజీ లాసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ 2026 తుది విడత ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించగా, సెప్టెంబర్ 25న సీట్ల కేటాయింపు జాబితా విడుదల కానుంది.