దండేపల్లిలో కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ: ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే

రిపోర్టర్: రాము స్థలం: దండేపల్లి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహావీరుడు కొమురం భీం విగ్రహాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్ లో వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం తన పోరాటంలో గతంలో అనేక కేసులు ఎదుర్కొన్నానని ఎమ్మెల్యే గుర్తుచేశారు.