దీపావళి వేళ వినియోగదారులకు షాక్: అమూల్ నెయ్యి, వెన్న ధరలు పెంపు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

దీపావళి పండుగ వేళ వినియోగదారులకు ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ భారీ షాక్ ఇచ్చింది. పెరిగిన డిమాండ్, సరఫరా కొరత కారణంగా నెయ్యి, వెన్న ధరలను పెంచుతున్నట్లు అమూల్ వర్గాలు వెల్లడించాయి. కేజీ నెయ్యి ధర రూ.50 పెరిగి రూ.680కి చేరగా, వెన్న ధరలు కూడా పెరిగాయని తెలిపాయి. ఈ ధరల పెంపుతో గతంలో ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ద్వారా వినియోగదారులకు లభించిన ఊరట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.