మనుబోలులో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం మరియు లడ్డు వేలం
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద గల విశ్వనాథ స్వామి దేవస్థానంలో వినాయక నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన గణనాథుని లడ్డు వేలంలో భక్తులు పోటీపడి పాల్గొన్నారు. మేకల యోగేశ్వరరావు, రాశి రవికుమార్, శివమ్మ, చెన్నూరు కరుణాకర్ రెడ్డి దంపతులు అత్యధిక ధర చెల్లించి లడ్డును దక్కించుకున్నారు. భక్తుల కోలాహలంతో నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ముగిసింది.