కాంగ్రెస్ ఓట్ చోరీ డ్రామాపై బీజేపీ ధ్వజం: జమ్ము కాశ్మీర్ రిగ్గింగ్ బట్టబయలు

రిపోర్టర్: రమేష్ స్థలం: Andhra Pradesh

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఓట్ చోరీ డ్రామా వెనుక ఉన్న అసలు నిజాలను బట్టబయలు చేస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1987 జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి భారీ రిగ్గింగ్కు పాల్పడిందని వెల్లడించారు. ఏకంగా డెబ్బై ఆరు స్థానాల్లో అరవై ఆరు సీట్లు గెలుచుకోవడానికి చేసిన ఆ రిగ్గింగే కాశ్మీర్లో రక్తాన్ని పారించిన సాయుధ తిరుగుబాటుకు ప్రధాన కారణమని గుర్తుచేశారు. ఈ ఘోర రిగ్గింగ్ను సొంత పార్టీ నేత శశి థరూర్ కూడా అంగీకరించారని స్పష్టం చేశారు.