స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబుతో భేటీ: కూటమిగానే బరిలోకి దిగుతామన్న జనసేన నేతలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో జనసేన నేతల కీలక సమావేశం ముగిసింది. భేటీ అనంతరం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, స్థానిక పరిస్థితుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన వెల్లడించారు.