విజయవాడలో జాతీయ సరస్ మేళా: ఈనెల 15న ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రిపోర్టర్: వెంకట్
స్థలం: Vijayawada
విజయవాడలోని పున్నమి ఘాట్లో ఈనెల 15 నుంచి జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దిల్లీ వెలుపల జాతీయ స్థాయిలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ వేడుక ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి ఆయన పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ మార్కెటింగ్ కల్పించడమే ఈ మేళా ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందని స్పష్టం చేశారు.