రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం: రేవంత్ సర్కార్ వైఫల్యమంటూ మ్యాకం రవికుమార్ మండిపాటు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యం కారణంగా మళ్లీ కరెంట్ సంక్షోభం తలెత్తిందని జర్నలిస్ట్ మ్యాకం రవికుమార్ ఆరోపించారు. సాగుకు కేవలం ఆరేడు గంటల మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని, గృహావసరాలకు సైతం కోతలు విధిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రం నాటి కష్టాలు మళ్లీ వచ్చాయని, విద్యుత్ కోతలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని మ్యాకం రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.