విద్యార్థులకు అలర్ట్: వింటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసిన బోర్డు
రిపోర్టర్: సురేష్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వింటర్ 2026 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు తమ ఎన్రోల్మెంట్ నంబర్, పాస్వర్డ్ వివరాలను ఉపయోగించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 9 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.