ప్రధాని మోదీ బాల్యమిత్రుడి భూ వివాదం పరిష్కారం
రిపోర్టర్: విజయ్
స్థలం: మహారాష్ట్ర
ప్రధాని నరేంద్ర మోదీ బాల్యమిత్రుడు అస్గర్ అలీ వోరాకు భారీ ఊరట లభించింది. మహారాష్ట్రలోని మీరా-భయందర్ ప్రాంతంలో కబ్జాకు గురైన తన భూమిపై ఆయన ఢిల్లీలో మోదీకి ఫిర్యాదు చేశారు. ప్రధాని కార్యాలయం జోక్యంతో స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులతో సమీక్ష నిర్వహించి వివాదాన్ని పరిష్కరించింది. బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా అనుమతులు వెనక్కి తీసుకోవడంతో అస్గర్ అలీకి న్యాయం దక్కింది.