తెలంగాణ శాసనమండలి పట్టభద్రుల స్థానాల అభ్యర్థుల ఖరారు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Telangana
తెలంగాణ శాసనమండలికి జరగనున్న ద్వైవార్షిక పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు రాబోయే శాసనమండలి ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు సామా రామ్మహన్ రెడ్డి పేరును అభ్యర్థిగా ఆమోదించినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ నిర్ణయంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపై స్పష్టత వచ్చిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.