కామారెడ్డి వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం: 14 మంది సీనియర్లు సస్పెండ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ వ్యవహారంలో పద్నాలుగు మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ వాల్యా వెల్లడించారు. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు రావడంతో నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విచారణలో ర్యాగింగ్ నిర్ధారణ కావడంతో నలుగురికి ఆరు నెలలు, మరో పది మందికి నాలుగు నెలల పాటు సస్పెన్షన్ విధిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.