కామారెడ్డి మున్సిపాలిటీలో అక్రమాల కలకలం: సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Kamareddy

కామారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ వసూళ్లు, అవకతవకలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. టెండర్లు, నియామకాలు, పన్ను మదింపు వంటి అన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు చేసి, దోషులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.