విజయవాడ దుర్గమ్మ భక్తులకు అలర్ట్: తప్పిపోయిన పిల్లల కోసం ప్రత్యేక దసరా యాప్
రిపోర్టర్: శివ
స్థలం: విజయవాడ
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా దసరా యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల సమయంలో పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా మొబైల్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అందులోని మైక్ ప్రచార కేంద్రం ఆప్షన్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపి సమాచారం ఇస్తే, వెంటనే పోలీసులు స్పందించి తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని అధికారులు స్పష్టం చేశారు.