దివ్యాంగుడికి దక్కని ప్రాధాన్యత: మెట్రో స్టేషన్ లిఫ్ట్ వద్ద ఘోర నిర్లక్ష్యం
రిపోర్టర్: నరేష్
స్థలం: Delhi
దివ్యాంగులకు మెట్రో లిఫ్ట్‌లలో ప్రాధాన్యత ఇవ్వాలన్న నిబంధనను ప్రయాణికులు పట్టించుకోలేదని కంటెంట్ క్రియేటర్ తేజ్ బేనివాల్ వెల్లడించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద వీల్‌చైర్‌లో ఉన్న తనను తోసిరాజంటూ ప్రయాణికులు ముందుగా లిఫ్ట్‌లోకి చొరబడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో, పౌర స్పృహ లోపించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.