ఆర్టీసీ బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలకు తిలోదకాలు: ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు వస్తువుల విక్రయం

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

ఆర్టీసీ బస్టాండ్లు మరియు పర్యాటక ప్రాంతాలలో వ్యాపారులు ఎమ్మార్పీ నిబంధనలను ఉల్లంఘిస్తూ వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నెల్లూరు ఆర్టీసీ డీఎం గోవర్ధన్ తెలిపారు. ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని తాగునీటి సీసాలు, శీతల పానీయాలు, చిప్స్ వంటి పదార్థాలపై పది నుంచి ఇరవై రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే దుకాణాదారులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.