పాఠశాల భవనం లేక అవస్థలు పడుతున్న సీతారామపురం విద్యార్థులు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: చింతపల్లి
ASR జిల్లా చింతపల్లి మండలం ఎర్రబొమ్మలు పంచాయతీ సీతారామపురం గ్రామంలో పాఠశాలకు సొంత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన తాటిపాక పూర్తిగా కూలిపోవడంతో బోధనకు వసతి కరువైంది. అధికారులు వెంటనే స్పందించి నూతన పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.