ఢిల్లీ సదస్సుకు హాజరైన మంత్రి నారా లోకేశ్
రిపోర్టర్: గోపి
స్థలం: ఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్నారు. పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 13వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొని కీలక అంశంపై ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులు, విదేశీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఢిల్లీ చేరుకున్న లోకేశ్‌కు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశమైన మంత్రి, వర్తమాన రాజకీయ పరిణామాలు మరియు రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చలు జరిపారు.