ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బేబీనాయన
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా అండగా ఉంటూ, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 35 మంది లబ్ధిదారులకు 26 లక్షల 98 వేల 31 రూపాయల ఆర్థిక సహాయం అందేలా కృషి చేసినట్లు ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు బేబీనాయన తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు.