నిర్మల హృదయంతో ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆంధ్రప్రదేశ్
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమాని ప్రేమ్ కుమార్ కుటుంబానికి ఎస్ కేఎన్ రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు చేతుల మీదుగా ఈ ఆర్థిక సాయాన్ని ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. మెగాభిమానులకు ఎక్కడ ఆపద వచ్చినా ఎస్ కేఎన్ ముందుంటారని మరోసారి నిరూపించుకున్నారు.