'మెగా డీఎస్సీ స్కామ్లో అడ్డంగా దొరికారు': కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: గోపి
స్థలం: Amaravati
ఏపీ డీఎస్సీ రిక్రూట్మెంట్లో భారీ కుంభకోణం బయటపడిందని, కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం, డీఎస్సీలో మాత్రం స్పోర్ట్స్ కోటా పేరుతో ఎలాంటి పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెడుతూ గుట్టు రట్టు చేసుకుందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సర్కార్ అవలంబిస్తున్న ఈ సందర్భ విధానాలపై యువత, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.