రైతన్నలకు తీపి కబురు: జూన్ నాటికి ముప్ పై ఆరు సాగునీటి ప్రాజెక్టుల పూర్తి

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది జూన్ నాటికి ముప్ పై ఆరు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుల పూర్తికి ఇంకా ముప్ పై ఏడు వేల నూట రెండు కోట్ల రూపాయలు అవసరమని అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక సాయం, నాబార్డు రుణాలు మరియు మూలధన వ్యయం కింద నిధులు సేకరించి పనులను వేగవంతం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.