పోలీసు సిబ్బందికి తీపి కబురు: ఖాతాల్లోకి లీవ్ ఎన్క్యాష్మెంట్ నిధులు

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి పెండింగ్లో ఉన్న లీవ్ ఎన్క్యాష్మెంట్ నిధులను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. శనివారం సాయంత్రంలోపు పోలీసు ఉద్యోగుల సొంత బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేలా ప్రత్యేక యంత్రాంగం పనులు చేపట్టింది. ఈ నిర్ణయంతో సుదీర్ఘకాలంగా బకాయిల కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి పెద్ద ఊరట లభించడంతో పాటు పోలీసు కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.