ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం ఏకీకృత సర్వీసు రూల్స్ తేవాలన్న భరత్ బాబు
రిపోర్టర్: BHARADWAJ
స్థలం: మునగాల
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో రెండు వేల రెండవ డీఎస్సీ ద్వారా ఎస్జీటీగా ఉద్యోగం పొందిన శ్రీ వక్కంతుల భరత్ బాబు నేటితో ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఏకీకృత సర్వీసు రూల్స్ లేకపోవడం వల్ల ఉపాధ్యాయులకు పదోన్నతులు రావడం లేదని, ప్రభుత్వం స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.