విద్యుత్ హెచ్చుతగ్గుల బీభత్సం: సింగారపువీధిలో కాలిపోయిన గృహోపకరణాలు
రిపోర్టర్: B RAJESH
స్థలం: బొబ్బిలి
బొబ్బిలి పట్టణంలోని సింగారపువీధిలో తీవ్రమైన విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. ఎన్నో రోజులుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి సంభవించిన ఈ ఘటనతో ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ లు దెబ్బతిన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు అధికారులు కోరుతున్నారు.