యువ ఒలింపిక్స్: పదిహేడు మందితో కూడిన భారత క్రీడాకారుల బృందం ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: Dakar
డార్కర్ వేదికగా జరిగే 2026 యూత్ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే పదిహేడు మంది సభ్యులతో కూడిన భారత జట్టును అధికారులు ప్రకటించారు. ఆఫ్రికా గడ్డపై తొలిసారి నిర్వహించనున్న ఈ మహా క్రీడోత్సవంలో పదకొండు మంది మహిళలు, ఆరుగురు పురుష క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సిండ్రెలా దాస్, తన్వి పత్రి, ధినిధి దేశింగు పతకాల సాధనే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి.