ఉద్యోగుల మోసంపై వి. శ్రీనివాస్ గౌడ్ ధ్వజం: కాంగ్రెస్ తీరుపై విమర్శలు

రిపోర్టర్: సురేష్ స్థలం: మహబూబ్ నగర్

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని వి. శ్రీనివాస్ గౌడ్ - మాజీ మంత్రి, మహబూబ్ నగర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మూడేళ్లు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీ చేయడంతోనే ప్రభుత్వం మొక్కుబడిగా రెండు డీఏల ప్రకటన చేసిందని, పేరుకుపోయిన బకాయిలను వెంటనే పూర్తిగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.