నకిలీ ఏఐ వీడియోల ప్రచారంపై మండిపడ్డ టీడీపీ నేత కేశవులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పుతలపట్టు

అయ్యప్పగారిపల్లి ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి మార్కొండ మందడి ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏఐ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ అభ్యర్థి కేశవులు తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న బాధ్యులపై అధికారులు తక్షణమే తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.