ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వివాదాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనట్లు పిటిషనర్ తెలిపారు. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, అలాగే సుమారు పదమూడు కోట్ల ఓట్ల తొలగింపుపై సిట్ లేదా న్యాయ విచారణ జరిపించాలని పిటిషన్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.