జైపూర్‌లో భార్య, ముగ్గురు కూతుళ్ల భీభత్స హత్య కలకలం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: రాజస్థాన్

జైపూర్‌లో నూతన సంచలనం సృష్టించిన నలుగురు హత్యల కేసులో విచారణ వేగవంతమైంది. నిందితుడు రాహుల్ ఝా తన భార్య గీత, ముగ్గురు కుమార్తెలను మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి మార్చాక, తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పుల బాధే ఈ ఘోరానికి ప్రధాన కారణమని భావిస్తున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.