రష్యా ఆర్మీలో విశాఖ యువకుల చిక్కులు: ప్రాణాలు కాపాడాలని వేడుకోలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: విశాఖపట్నం

ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖపట్నానికి చెందిన ఐదుగురు యువకులు మోసపోయి సైన్యంలో చిక్కుకున్నట్లు బాధితులు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ ప్యాకేజింగ్ ఉద్యోగాల పేరుతో మోసగించి ఉక్రెయిన్ సరిహద్దు యుద్ధభూమికి పంపించారని తెలిపారు. తమను సురక్షితంగా రక్షించి భారత్ కు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నట్లు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.