జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్ లష్కరే సీనియర్ కమాండర్ హతం

రిపోర్టర్: నరేష్ స్థలం: Budgam

జమ్మూకశ్మీర్లోని బద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సీనియర్ కమాండర్ హతమయ్యాడని భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతిచెందిన ఉగ్రవాదిని పాకిస్థాన్ సైన్యంలోని ఎలైట్ ఎస్ఎస్జీ మాజీ కమాండో మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ హాషిమ్ మూసాగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భారత్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఈ మోస్ట్ వాంటెడ్ కమాండర్ కీలక సూత్రధారిగా వ్యవహరించాడని, ఈ ఆపరేషన్ సరిహద్దు ఉగ్రవాద కుట్రలను తిప్పికొట్టడంలో అత్యంత కీలకమైనదని బలగాలు స్పష్టం చేశాయి.