స్థానిక ఎన్నికల్లో పటిష్ట భద్రతతో కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్న ఐజీ గోపీనాథ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి స్పష్టం చేశారు. పాలకొండ సబ్ డివిజన్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు.