చౌటుప్పల్ సిట్ స్కిల్స్ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు: అలరించిన నృత్యాలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని డీడీయూజీకేవై సిట్ స్కిల్స్ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. శిక్షణార్థులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది సంప్రదాయ నృత్యాలు, పాటలతో ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ విశిష్ట సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని నిర్వాహకులు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు గంజి శ్రీరాములు, బోడ శ్వేత, శిలోజు చైతన్య, కత్తుల జైపాల్, చినుకని యువరాజు మరియు పలువురు విద్యార్థులు పాల్గొని వేడుకలను ఘనంగా విజయవంతం చేశారు.