వారణాసిలో శ్రీ కాశీ విశ్వనాధుడిని దర్శించుకున్న చంద్రబాబు

రిపోర్టర్: కృష్ణ స్థలం: వారణాసి

పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీ కాశీ విశ్వనాధుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పవిత్ర జలాలతో అభిషేకించారు. ఆలయ పండితులు సీఎంకు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.