గుడ్ న్యూస్ చెప్పిన ప్రముఖ నటి మహీరా ఖాన్!
రిపోర్టర్: గోపి
స్థలం: World
పాకిస్థానీ ప్రముఖ నటి మహీరా ఖాన్ తాను త్వరలో తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. వైట్ గౌన్ ధరించి బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆమె ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. సలీమ్ కరీమ్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇది రెండవ సంతానం. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా, సెలబ్రిటీలు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.