అనంతపురం రాప్తాడు ఘటన: ఎన్ కౌంటర్ డిమాండ్లపై సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ సంఘటన నేపథ్యంలో నిందితులను ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్లు పెరగడంపై సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో జాప్యం వల్లే ప్రజల్ లో ఈ తరహా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని విశ్లేషకులు తెలిపారు. అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులు శిక్షకులుగా మారడం ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ స్ఫూర్తికి తీవ్ర ముప్పు అని, ఇది అంతిమంగా అరాచకత్వానికి దారి తీస్తుందని హెచ్చరించారు.