విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్ లో తెదేపా దూకుడు: మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి భారీ ఆధిక్యం

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ లో తెదేపా దూసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. తెదేపా మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తన సమీప వైకాపా అభ్యర్థి వరుదు కల్యాణిపై ముప్ఫై ఎనిమిది వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో తెదేపా భారీగా ఆధిక్యం సాధించిందని, పలు డివిజన్లలో కూటమి అభ్యర్థులు విజయపథంలో దూసుకెళ్తున్నారని అధికారులు స్పష్టం చేశారు.