రాజాంలో కన్నులపండువగా సాగిన భవానీ మాలధారుల రథయాత్ర భక్తిపారవశ్యం
రిపోర్టర్: RAMESH LAVETI
స్థలం: రాజాం
విజయనగరం జిల్లా రాజాం మండలం డోలపేట ప్రాంతంలో భవానీ మాలధారులు చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దసరా వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, రదయాత్రలో భవానీ స్వాములు భక్తిశ్రద్ధలతో పాల్గొని నృత్యాలు చేశారు. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక దృశ్యాలను తిలకించి పరవశించిపోయారు. ఈ వేడుకలు ఆ ప్రాంతంలో ఎంతో పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.