రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ కేంద్రం పునఃప్రారంభం
రిపోర్టర్: సతీష్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పునఃప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఉత్సవాలు ముగియడంతో భక్తుల సౌలభ్యం కోసం గురువారం నుంచి దీన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. విమానంలో వచ్చే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.