శర్వానంద్ జార్జ్‌క్రిష్ సినిమా ఫస్ట్‌బూస్టర్ విడుదల చేసిన మేకర్స్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ‘జార్జ్‌క్రిష్’. దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా గురువారం మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌బూస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ క్రిస్టియన్ జార్జ్, హిందువు క్రిష్ పాత్రల్లో రెండు విభిన్న మతాలకు చెందిన గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.