తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఆంధ్రప్రదేశ్‌కు ఐదు రోజుల పాటు రెడ్ అలర్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి అర్ణబ్ తుపానుగా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ అతి తీవ్ర తుపాను బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.