తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, మహిళలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ కొలిచే ఈ అద్భుతమైన వేడుక తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు. తొలి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకు అధికారిక హోదా కల్పించినట్లు కేసీఆర్ గుర్తుచేశారు.