మోడల్ స్కూల్ అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మందమర్రి
మందమర్రిలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరుగురు ఎక్స్టర్నల్ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ చంద్రయ్య తెలిపారు. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల నాలుగు నుంచి ఆరో తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.