కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి పడిపోయింది. గత కేసీఆర్ హయాంలో కళకళలాడిన భూముల క్రయవిక్రయాలు, నేడు కొనుగోలుదారులు లేక పూర్తిగా మందగించాయి. అత్యవసరానికి అమ్ముదామన్నా కొనేవారు కరువయ్యారని, ఇది పూర్తిగా ప్రభుత్వ పాలనా వైఫల్యమేనని రియల్ ఎస్టేట్ నిపుణులు మండిపడుతున్నారు.