ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ మావోయిస్టు డంప్ గుట్టురట్టు: ఏకే-47 తుపాకులు స్వాధీనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Dantewada
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలు నిర్వహించిన ఉమ్మడి కూంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టులకు చెందిన భారీ ఆయుధాల డంప్ బయటపడిందని పోలీసులు వెల్లడించారు. భన్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భూమిలో పాతిపెట్టిన ఈ డంప్ నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్ సహా ఎనిమిది రకాల తుపాకులు, బీజీఎల్ లాంచర్లు, కుక్కర్ బాంబులు, భారీగా పేలుడు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.